మహేష్ బాబు సినిమా విషయంలో మోసం చేశారన్న నటుడు.. నాకు పొగరు ఎక్కువంటూ?

ప్రముఖ నటుడు వినయ్ వర్మ ( Vinay Verma )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భరత్ అనే నేను సినిమా( Bharat Ane Nenu ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వినయ్ వర్మ కొన్ని సినిమాలలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలలో నటించగా ఆ పాత్రల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్నిసార్లు మనం మోసపోతామని ఆయన అన్నారు.మనకు చెప్పేదొకటని అక్కడ జరిగేది ఒకటని ఆయన తెలిపారు.

లైఫ్ లో ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటామని ఆయన పేర్కొన్నారు.

భరత్ అనే నేను సినిమా విషయంలో తనకు అన్యాయం, మోసం జరిగిందని వినయ్ వర్మ చెప్పుకొచ్చారు.చెప్పిన మాటలు నమ్మి మనం సినిమాకు ఓకే చెబుతామని ఆయన తెలిపారు.పుష్ప సినిమాలో నరేషన్ ఇచ్చారని నాకు నచ్చలేదని 50 డేస్ వర్క్ ను నేను మిస్ చేసుకున్నానని అయితే నచ్చని పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

ఒక్క సీన్ ఉన్నా ఆ సీన్ మంచి సీన్ ఉండాలని డెప్త్ ఉన్న పాత్ర అయితే చేయాలని ఆయన తెలిపారు.సితార బ్యానర్ ( Sitara banner )లో ఒక సినిమాలో రెండు సీన్లలో చేశానని పాత్ర మంచి పాత్ర అని ఆయన చెప్పుకొచ్చారు.

మనకు సరిపోయే పాత్రల్లో మాత్రమే నటించాలని వినయ్ వర్మ అన్నారు.నా రోల్ గురించి అడగడం తప్పా అని వినయ్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

పాత్రలను రిజెక్ట్ చేయడంలో తప్పేముందని అయన చెప్పుకొచ్చారు.మంచి ఆర్టిస్ట్ కావాలంటే పాత్ర గురించి వివరించాలని ఆయన తెలిపారు.కొన్ని సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు.

పలు వివాదాల ద్వారా కూడా వినయ్ వర్మ వార్తల్లో నిలిచారు.ఆయన చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!

నాకు ఆటిట్యూడ్, ఆరోగెన్స్ ఎక్కువేనని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు