టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే జలసీగా ఉంటుంది... నటుడు విక్రమ్ షాకింగ్ కామెంట్స్! 

ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram )గురించి  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఏ సినిమా చేసినా సరే అందులో తప్పకుండా తన మేనరిజం మనకు కనిపిస్తుంది.

ఇలా ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాల ద్వారా విక్రమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరా ధీరా శూరన్ -2’.అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దుషారా విజయన్ (Dushara Vijayan)  హీరోయిన్గా నటిస్తున్నారు.

Actor Vikram Sensational Comments On Tollywood Industry , Tollywood, Vikram, Vee

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.నాకు టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే చాలా జలసీగా ఉందని తెలిపారు.

Actor Vikram Sensational Comments On Tollywood Industry , Tollywood, Vikram, Vee
Advertisement
Actor Vikram Sensational Comments On Tollywood Industry , Tollywood, Vikram, Vee

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇలా కమర్షియల్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా చిన్న చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అందుకుంటున్నాయి.అలాగే తమిళ్ పరిశ్రమలో కూడా అలాంటి సినిమాలు రావాలని , దాని పైనే తమిళ పరిశ్రమ కూడా పనిచేస్తోందని తెలిపారు.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆర్టిస్టులుగా మాకు కావాల్సింది కూడా ఇదే అంటూ ఈయన తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.ఇక హీరో విక్రమ్ సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు