ఆడియో ఫంక్షన్స్ కి రావడం సుద్ద దండగ : రవిబాబు

సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్.సినిమాలపై అంచనాలు పెంచాలంటే ముందు నానా హంగామా చేయాలి.

కనీ వినీ సినిమా అని చెప్పాలి.ఆహా ఓహో అని పొగడాలి.

ఇవన్నీ చేయాలి అంటే ఆడియో ఫంక్షన్లు చేయాలి.ప్రీ రిలీజ్ ఈవెంట్లు మొదలుపెట్టాలి.

సినిమా పరిశ్రమను అంతా పిలవాలి.నానా రచ్చ చేయాలి.

Advertisement

మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చెయ్యాలి.అప్పుడే సినిమా జనాల్లోకి వెళ్తుందనేది ఫిల్మ్ మేకర్స్ ఆలోచన.

అయితే ఆడియో ఫంక్షన్లు అంటే తనకు చెడ్డ చిరాకు అంటున్నాడు ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు.ఇంతకీ ఆడియో ఫంక్షన్స్ గురించి ఆయన అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడియో ఫంక్షన్స్ తనకు చాలా బోర్ అనిపిస్తాయని చెప్పాడు రవిబాబు.ఆ వేడుకల్లో విసుగు తప్ప మరేం ఉండదని చెప్పాడు.

గంటలు గంటలు వేస్ట్ చేసుకుని అక్కడికొచ్చిన వాళ్లంతా చెప్పే సోదంతా వినకతప్పదన్నాడు.యాంకర్ ఏదేదో మాట్లాడుతూ.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
నాని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతారా..?

ఎవరెవరినో స్టేజి మీదకు పిలుస్తుందన్నాడు.వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కో ఏవీ ఏస్తూ బోర్ కొటిస్తారని చెప్పాడు.

Advertisement

స్టేజి మీద యాంకర్ మాట్లాడే మాటలకు.స్టేజి మీదకు వచ్చిన గెస్టులకు మధ్య రకరకాల విషయాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుందన్నాడు.

ఇప్పుడు పలానా వారు పాట రిలీజ్ చేస్తారని చెప్పడం.మళ్లీ సాంగ్ ప్లే అని ఆమే చెప్పడం నవ్వు కలిగిస్తుందన్నాడు.స్టేజి మీద సెల్ప్ డబ్బా.

అనవసర సంగతులు తప్ప మరేం ఉండవన్నారు.టీవీలో లైవ్ కోసం చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెప్పి విసిగిస్తారన్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆడియో వేడుకల పద్దతిని ఎలా మార్చాలో అర్థం కావడం లేదంటాడు రవిబాబు.అందుకే తన సినిమాలకు సంబంధించిన పాటలను ఏ రేడియో స్టేషన్ వారికో ఇచ్చి లాంచ్ చేయమని చెప్తానన్నాడు.

మొత్తంగా సినిమా ఆడియో వేడుక అంటే ఉత్త సోది అన్నాడు.అందుకే ఈ వేడుకలను నిర్వహించకపోవడమే మంచిదన్నాడు రవి బాబు.

తాజా వార్తలు