హీరో కూతుర్ల ఆరాటం, హాట్‌ ఫొటో షూట్స్‌తో ప్రయత్నం

జీవిత రాజశేఖర్‌ల ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్‌గా పరిచయం అయ్యారు.చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే శివాత్మిక ఒక మోస్తరుగా ప్రేక్షకులను అలరించింది.ఇక పెద్దమ్మాయి శివాని విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా చాలా కాలం క్రితమే సినిమా ప్రారంభం అయ్యింది.

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.ప్రస్తుతం శివాని రెండవ సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

ఒక వైపు రాజశేఖర్‌ హీరోగా చేస్తూ కూతుర్లను హీరోయిన్స్‌గా పరిచయం చేసిన నేపథ్యంలో వారికి పెద్దగా ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం లేదు.తెలుగులో హీరోల కూతుర్లకు ఎక్కువ రెస్పెక్ట్‌ ఇస్తారనే టాక్‌ ఉంది.అందుకే శివానీ మరియు శివాత్మికలను తమ సినిమాలో బుక్‌ చేసి హాట్‌గా చూపించేందుకు వారు సాహసం చేయడం లేదు.

Advertisement

ఒక వేళ అలా చేసినా కూడా ప్రేక్షకులు తిరష్కరించే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకే అసలు అవకాశాలు వారికి ఇవ్వడం లేదు.ఇండస్ట్రీ నుండి అవకాశాలు రాకపోవడంతో ఈ ఇద్దరు సిస్టర్స్‌ కూడా తామిద్దరం కూడా అందాల ప్రదర్శణకు ఎలాంటి అడ్డు చెప్పమని, ముద్దు సీన్స్‌ విషయంలో, రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో రచ్చ చేయకుండా కమర్షియల్‌ హీరోయిన్స్‌ తరహాలో నటిస్తామని చెప్పకుండానే చెప్పేలా ఫొటో షూట్‌ స్టిల్స్‌ను విడుదల చేస్తున్నారు.

హాట్స్‌ హీరోయిన్స్‌ కన్నా కాస్త ఎక్కువగానే గ్లామర్‌గా ఫొటో షూట్స్‌కు ఫోజులు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా వీరిద్దరికి ఛాన్స్‌లు వచ్చేనా చూడాలి.ఒకవేళ వచ్చినా కూడా చిన్నా చితకా హీరోలతోనే వీరికి ఛాన్స్‌లు వచ్చే అవకాశం ఉంది.

Advertisement