పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని అందుకోవటం తెలిసిందే.

ఏపీలో కూటమి ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీని గెలిపించుకున్నారు.

పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కి చాలామంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజా ఫలితాలతో ఎన్డీఏలో జనసేన కీలకపాత్ర పోషిస్తూ ఉంది.జాతీయ రాజకీయాలలో జనసేన పార్టీ పేరు గట్టిగా వినిపిస్తుంది.

అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో జనసేనకి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Actor Prakash Raj Sensational Comments On Pawan Kalyan Janasena, Prakash Raj, P
Advertisement
Actor Prakash Raj Sensational Comments On Pawan Kalyan Janasena, Prakash Raj, P

ఇదిలా ఉండగా తాజాగా నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు."ఎన్నికలలో చారిత్రాత్మక విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు( Chandrababu )కి అభినందనలు.మీ ఇద్దరితో వ్యక్తిగతంగా నాకు మంచి అనుబంధం ఉంది.

ఎన్డీఏలో ఉన్న మీరు మిత్రపక్ష నాయకుడు నరేంద్ర మోడీ మాదిరిగా కాకుండా సెక్యులర్ భావాలు కలిగి ఉంటారని భావిస్తున్నా.జాతీయ రాజకీయాల్లో మీకు వచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలి.

అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది" అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు