Naresh Sarath Babu: పవిత్రను జాగ్రత్తగా చూసుకో అని ఆయన చివరి రోజు చెప్పారు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఎంఎస్ రాజు దర్శకత్వంలో నటి పవిత్ర లోకేష్, నరేష్( Naresh Pavitra Lokesh ) కలిసి నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి.

( Malli Pelli Movie ) ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ మాట్లాడుతూ.భారతీయుడిగా, అందులోనూ తెలుగువాడిగా పుట్టడం చాలా గర్వంగా ఉంది.

సినిమా కుటుంబంలో పుట్టి, దాదాపు 50 ఏళ్లుగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.తన జీవిత భాగస్వామి విజయనిర్మల( Vijayanirmala ) ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం కృష్ణగారు( Superstar Krishna ) విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ను ప్రారంభించారు.నా వరకు బోల్డెస్ట్‌ కపుల్‌ అంటే వాళ్లిద్దరే.

Advertisement

ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్‌ చూసిన తర్వాత వాళ్లిద్దరి దీవెనలు మేము అందుకుంటామనే నమ్మకం నాకు ఉంది.గుడ్‌ కపుల్‌, మంచి ఆర్టిస్టులం అని మేము పేరు తెచ్చుకుంటే చాలు.

అంతకు మించి ఏమీ అక్కర్లేదు.

రానున్న రోజుల్లోనూ విజయకృష్ణ పతాకం పై మంచి చిత్రాలను తెరకెక్కించాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు నరేష్. రాజుతో మూడేళ్ల పాటు మా ప్రయాణం జరిగింది.రెండు, మూడు సబ్జెక్ట్‌లు వద్దనుకున్నాక ఈ సబ్జెక్ట్‌ తీయాలనే నిర్ణయానికి వచ్చాం.

ఎంటర్‌టైన్‌మెంట్‌, బోల్డ్‌ మెసేజ్‌ కలిపితే ఈ సినిమా.ఈ సినిమాని మేము కష్టపడి కాదు ఇష్టపడి చేశాం.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఇక, కోకిల సినిమా నుంచి శరత్‌బాబుతో( Sarath Babu ) నాకు మంచి అనుబంధం ఉంది.ఈ సినిమా కోసం అడిగినప్పుడు జయసుధ, శరత్‌బాబు ఎలాంటి సందేహం లేకుండా ఓకే అన్నారు.

Advertisement

పవిత్రను జాగ్రత్తగా చూసుకో.తను చాలా మంచిది.

సంతోషంగా ఉండండి అని చివరిరోజు షూట్‌ పూర్తి చేసుకుని వెళ్తూ శరత్‌బాబు నాతో చెప్పారు.ఈ క్షణం ఆయన్ని నేను ఎంతో మిస్‌ అవుతున్నాను అని తెలిపారు నరేష్.

తాజా వార్తలు