డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్( Gabber Singh ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ శృతిహాసన్ ( Shruthi Hassan ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తల్లిదండ్రుల పాత్రలలో నటి సుహాసిని( Suhasini ) నటుడు నాగినీడు ( Nagineedu ) నటించిన సంగతి మనకు తెలిసిందే.మొదటి నుంచి కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తన తండ్రి అంటే పడని విధంగానే చూపిస్తారు.
కానీ క్లైమాక్స్ లో మాత్రం నాగినీడు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశం అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది.
ఇలా ఈ సన్నివేశం గురించి తాజాగా నటుడు నాగినీడు ( Nagineedu )మాట్లాడటమే కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నాగినీడు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ చాలా గొప్ప నటుడు.ఇలా స్టార్ హీరో అయినప్పటికీ ఈయనలో ఏ మాత్రం గర్వం ఉండదు ఒక సాధారణ వ్యక్తి లాగే సెట్ లోకి అడుగు పెడతారు.
ఇక సెట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు.అయితే తన ముందు ఎప్పుడు ఎవరో ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారని వారితోనే తను మాట్లాడుతూ ఉంటారని తెలిపారు.
ఇలాంటి గొప్ప నటులతో కలిసి సినిమాలలో నటించడం నిజంగా అదృష్టమని నాగినీడు( Nagineedu ) తెలిపారు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్ని వేషంలో నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య వచ్చే సన్నివేశం సినిమాకి ఎంతో హైలెట్ గా నిలిచింది .ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అలాగే థియేటర్లలో ఈ సీన్ వచ్చినప్పుడు నాకు నిజంగానే పవన్ కళ్యాణ్ ఒక సొంత కొడుకు అనే భావన కలిగింది అంటూ ఈయన తెలియజేశారు.ఈ విధంగా నటుడు నాగినీడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ గబ్బర్ సింగ్ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy