టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో 50 కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ ఉన్న హీరోలుగా బాలకృష్ణ, నాగార్జునలకు పేరుంది.
ఈ మధ్య కాలంలో బాలయ్య, నాగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ ను అందుకోలేకపోయినా కొన్నేళ్ల క్రితం వరకు ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి.
తెలుగులోని ప్రముఖ నటులలో ఒకరైన సీవీఎల్ నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తనకు ఫస్ట్ టేక్ లోనే సీన్ ను ఓకే చేయాలనే స్వార్థంతో ఉంటానని నరసింహారావు చెప్పారు.
నాజర్ గారితో తాను ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించానని మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యామని నరసింహారావు వెల్లడించారు.తాను రోల్ కంటే సొసైటీ గురించి ఎక్కువగా మాట్లాడతానని నరసింహారావు పేర్కొన్నారు.
నాజర్ బంగారం అని సోనూసూద్, రామ్ చరణ్ ఎటువంటి భేషజాలు లేకుండా ఉంటారని నరసింహారావు తెలిపారు.బాలకృష్ణ, నాగార్జున సినిమాలలో తనకు ఆఫర్లు రాలేదని అందువల్లే ఆ హీరోలతో కలిసి తాను నటించలేకపోయానని నరసింహారావు పేర్కొన్నారు.
రామ్ చరణ్ తో ధృవ, ఆచార్య చేస్తున్నానని నరసింహారావు అన్నారు.మెగా హీరోలతో అలా కుదిరిందని రిపబ్లిక్ సినిమాలో కూడా తాను నటిస్తున్నానని నరసింహారావు వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీ వాళ్లకు మనుషులని మనుషుల్లా చూడటం తెలీదని నరసింహారావు అన్నారు.
తెలుగమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కూడా ఇదే కారణమని నరసింహారావు అభిప్రాయపడ్డారు.ఎంతోమంది రంగస్థలంపై గొప్ప నటులుగా ప్రూవ్ చేసుకుని సినిమాల్లో మాత్రం సక్సెస్ సాధించలేకపోయారని సీవీఎల్ నరసింహరావు అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో నరసింహా రావు బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా తెరకెక్కే సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.
నరసింహరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సైతం ఒక ప్రకటన చేశారనే విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy