Central Election Commission : రాష్ట్రాల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు..!!

దేశంలోని పలు రాష్ట్రాల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.ఈ మేరకు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ( Rajeev Kumar )ను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు బదిలీ చేయాలని సీఎస్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.కొత్త డీజీపీ నియామకం కోసం అర్హత ఉన్న ముగ్గురు అధికారులతో జాబితాను పంపాలని ఆదేశించింది.అదేవిధంగా గుజరాత్, యూపీ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ హోంశాఖ కార్యదర్శులను కూడా ఈసీ తొలగించింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు