తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అచ్చెన్నాయుడు ఫైర్

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి, కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, డీఎస్పీ చైతన్యలు దళిత మహిళపై కక్షకట్టి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

చదువురాని ఎమ్మెల్యేకు చదువుకోమని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు.చదువుకోమని సలహా ఇస్తే దళిత మహిళపై అట్రాసిటీ కేసు పెడతారా అని మండిపడ్డారు.

కేతిరెడ్డి చదువుకోవడానికి ముందుకు వస్తే ఎల్ కేజీ నుంచి తాము చదివిస్తామని తెలిపారు.పెద్దారెడ్డి, కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు.

డీఎస్పీ చైతన్య చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు