'ఆచార్య' రెండవ పాటతో మెగా ఫ్యాన్స్‌ కు పండగే పండగ

మెగా స్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

ఈ నెలలో సినిమా ను పూర్తి చేసి వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తున్నారు.ఇప్పటికే మొదటి పాట లాహె లాహె పాటను విడుదల చేశారు.

Acharya Movie Second Song Coming Soon,latest Tollywood News-ఆచార్య#8

చిరంజీవి కాజల్‌ లతో పాటు సంగీత కూడా పాటలో కనిపించి కలర్‌ ఫుల్‌ గా నిలిపారు.విడుదలైన రెండు రోజుల్లోనే పాట 10 మిలియన్ వ్యూస్ ను చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఆచార్య నుండి రెండవ పాటను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే విడుదల అయిన పాట లాహె లాహె లో చిరంజీవి కాజల్‌ లు కనిపించారు.

Advertisement

ఆచార్య నుండి రాబోతున్న రెండు పాట మరింత ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.ఆచార్య సినిమా నుండి రాబోతున్న ఆ రెండవ పాటలో చరణ్ మరియు చిరంజీవిలు కలిసి ఉంటారని అంటున్నారు.

ఆచార్య లో చరణ్‌ పాత్ర పై చాలా అంచనాలు ఉన్నాయి.తాజాగా ఆ అంచనాలు మరింతగా పెంచేలా చరణ్‌ లుక్‌ వచ్చింది.

ఇప్పుడు చరణ్‌ నుండి పాట రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందంగా వెయిట్‌ చేస్తున్నారు.ఉగాది లేదా శ్రీరామ నవమి సందర్బంగా ఈ పాటను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా లోని రెండవ పాటతో మెగా ఫ్యాన్స్‌ కు పండగ రెట్టింపు అవ్వడం ఖాయం అంటున్నారు.మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్‌ పాటలను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను ఖచ్చితంగా ఆధరిస్తారని అంటున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

మణి శర్మ చిరంజీవి ఇమేజ్‌ కు సరైన పాటలను ఈ సినిమా కోసం ఇస్తాడని మొదటి పాటతోనే క్లారిటీ వచ్చింది.ఇక రెండవ పాట పీక్స్‌ లో ఉండటం ఖాయం అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు