ఆచార్య మూవీకి ఓటీటీలో అలాంటి రెస్పాన్స్.. మరీ దారుణం అంటూ?

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సాధించలేదంటే ఈ సినిమా పరిస్థితి అర్థమవుతుంది.

విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది.భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులకు ఈ సినిమా ఫలితం ఒకింత షాకిచ్చిందని తెలుస్తోంది.

ఓటీటీలో కూడా మెగా హీరోలకు అవమానమే జరిగిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఇలాంటి రెస్పాన్స్ ను అందుకుందని మరి కొందరు చెబుతున్నారు.

Advertisement

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో ఈ సినిమాకు కొంతమేర నష్టాలు తగ్గాయని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో థియేటర్లలో హిట్ కాని చాలా సినిమాలు ఓటీటీలలో సత్తా చాటుతున్నాయి.

అయితే ఆచార్య సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరగడం గమనార్హం.ఆచార్య సినిమాను కొనుగోలు చేయడం వల్ల ఓటీటీ నిర్వాహకులకు భారీ నష్టాలు మిగిలాయని సమాచారం.

ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.సినిమాకు మరీ నెగిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో భారీస్థాయిలో ట్రోలింగ్ జరగడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.ఆచార్య ఫ్లాప్ తో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు