కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ డిస్మిస్.. !

కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టు విచారణ జరిపింది.

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ధర్మాసనం పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడం ఇది పదో సారని తెలుస్తోంది.అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న ఎన్ఐఏ కోర్టులో వాదనలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.

కాగా విమానాశ్రయంలో దాడి ఘటనలో వైసీపీ నాయకులపై కూడా కేసు నమోదు అయిందన్న నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ వారిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.ఈ కేసు విచారణలో భాగంగా జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని సలీం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు