మంచిర్యాల జిల్లా ఇందారం హత్య కేసులో నిందితులు అరెస్ట్

మంచిర్యాల జిల్లా ఇందారంలో సంచలనం సృష్టించిన మహేశ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఐదుగురు అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబంగా పోలీసులు గుర్తించారు.కనకయ్య, పద్మ, సాయి, శృతి, శ్వేతలను అరెస్ట్ చేశారు.

అయితే మృతుడు మహేశ్, శృతి గతంలో ప్రేమించుకున్నారు.విషయం తెలిసిన కుటుంబ సభ్యులు యువతిని వేరొకరికి ఇచ్చి వివాహం చేశారు.

దీంతో కోపోద్రిక్తుడైన మహేశ్ వారి వీడియోస్ ను యువతి భర్తకు పంపించాడు.ఈ క్రమంలో అవమాన భారం తాళలేక యువతి భర్త ఆత్మహత్యకు చేసుకున్నాడు.

Advertisement

దీంతో మహేశ్ పై కోపం పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు  దారుణంగా బండరాయితో కొట్టి హత్య చేశారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు