అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024.. ట్రంప్ గెలిస్తే భారత్‌కు లాభమా? నష్టమా?

మరో పది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరగనున్నాయి.

డెమొక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఎన్నికల బరిలో నిలిచారు.

వీరిద్దరిలో ఎవరు అధ్యక్షుడవుతారు.? కమలా హారిస్ గెలిచి అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారా.? డొనాల్డ్ ట్రంప్ తన జీవితంలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారా.? అంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అన్నింటిలోకి ట్రంప్ గురించే అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.తీవ్ర జాతీయ భావాలున్న ఆయన తన హయాంలో అమెరికా ఫస్ట్( America First ) నినాదంతో విదేశీయులకు చుక్కలు చూపించారు.మెక్సికో నుంచి అమెరికాలోకి వలసలు నిర్మూలించేందుకు భారీ గోడను నిర్మించి సంచలనం సృష్టించారు.

ట్రంప్ పాలనా కాలంలో ఇమ్మిగ్రేషన్ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని విదేశీ వృత్తి నిపుణులు, కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.ట్రంప్ ఒత్తిడితో కొన్ని కంపెనీలు స్థానికులను నియమించుకున్నాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

తాజా అమెరికా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నదానిపై ఫిలిప్ క్యాపిటల్( Phillip Capital ) అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించి నివేదికను విడుదల చేసింది.ట్రంప్ గెలిస్తే వీసా నిబంధనలు మరింత కఠినతరమవుతాయని.దీంతో ఐటీ కంపెనీలు స్థానికులకే పెద్దపీట వేయాల్సిన పరిస్థితి వస్తుందని నివేదిక అభిప్రాయపడుతోంది.

అమెరికాలో గ్యాస్, ముడిచమురు ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు పడిపోతాయని నివేదిక వెల్లడించింది.ట్రంప్ చైనాను టార్గెట్ చేస్తే భారత్‌కు కలిసొస్తుందని అభిప్రాయపడింది.కాగా.

ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్ధతు ప్రకటించిన టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారీగా విరాళాలు అందజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తాజాగా భారత కరెన్సీలో ట్రంప్‌కు రూ.470 కోట్ల విరాళం అందజేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.ఇప్పటి వరకు ట్రంప్ కోసం మస్క్ దాదాపు రూ.1100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు