అనంత‌పురం-గుంటూరు హైవేపై ప్ర‌మాదం.. పేలిన గ్యాస్ సిలిండ‌ర్లు

అనంత‌పురం- గుంటూరు జాతీయ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

ప్ర‌కాశం జిల్లా కొమ‌రోలు మండ‌లం ద‌ద్ద‌వాడ వ‌ద్ద‌ మూడు వంద‌ల‌కు పైగా గ్యాస్ సిలిండ‌ర్ల‌తో వెళ్తున్న లారీలో మంట‌లు చెల‌రేగాయి.

గ‌మ‌నించిన డ్రైవ‌ర్ వెంట‌నే లారీ ఆపి కింద‌కి దిగాడు.సిలిండ్లు పేలే ప్ర‌మాదం ఉండ‌టంతో రోడ్డుకి ఇరువైపులా వాహ‌నాల‌ను నిలిపివేశారు.

స‌మాచారం అందుకున్న హైవే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌మీప ప్రాంత వాసుల‌ను ఖాళీ చేయించారు.సిలిండ‌ర్లు పెద్ద శ‌బ్ధంతో పేలుతుండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

దూరం నుంచే మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు ఫైర్ సిబ్బంది.ఈ ప్ర‌మాదంలో దాదాపు 100 సిలిండ‌ర్లు పేలిపోయాయి.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు