Sheep distribution scam : గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణం( Sheep distribution scam )లో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ పథకంలో మొత్తం రూ.

2.10 కోట్ల స్కాం జరిగిందని అధికారులు గుర్తించారు.విచారణలో భాగంగా నలుగురు పశుసంవర్ధక శాఖ( Animal Husbandry Department ) అధికారులను ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచారని ఏసీబీ( ACB ) నిర్ధారించిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు బాధితుల నుంచి వివరాలను సేకరించారు.బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది.

ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఆరా తీస్తున్నారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు