నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు చేస్తున్నారు.ఈ మేరకు మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారని తెలుస్తోంది.ఎల్బీనగర్ హస్తినాపూర్ లోని మహేందర్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ దాడులలో భాగంగా భారీగా నగదు, బంగారం లభ్యమైందని సమాచారం.

మరోవైపు మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంతో పాటు మహేందర్ రెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.కాగా రెండు నెలల క్రితమే రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు నుంచి మర్రిగూడకు బదిలీ అయ్యారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు