దేశంలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..!!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) ముగిశాయి.ఈసారి ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.

ఈ క్రమంలో మూడోసారి ఎన్డీఏ ( NDA )ప్రభుత్వం స్థాపించడం జరిగింది.ఈ ఎన్నికలలో గతంలో కంటే కాస్త తక్కువ సీట్లు రావడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ప్రధానిగా మోదీ జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేసింది.

ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావాళిని సీఈసీ ఎత్తివేసింది.దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియటంతో కోడ్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

Abolition Of Election Code In The Country Ec, Election Code , General Elections
Advertisement
Abolition Of Election Code In The Country EC, Election Code , General Elections

నాలుగో దశలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ( Parliament Elections )జరిగాయి.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోడ్ తొలగినట్లు అయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 స్థానాలలో గెలిచి భారీ మెజార్టీ సాధించింది.

ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ( Chandrababu )జూన్ నెల 12వ తారీకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి.

ఎన్డీఏకి దీటుగా ఇండియా కూటమి కూడా అత్యధిక ఎంపీ స్థానాలు సంపాదించింది.దీంతో ఈసారి పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు