ABN Radhakrishna: ఎంత పెద్ద రాజకీయనాయకుడైన సరే అతడు చేయి వేస్తే మటాష్..!

కొంత మంది దీవిస్తే మంచి జరుగుతుంది అంటారు.అలాగే కొంత మంది ఏదైనా వారి చేత్తో ఇచ్చిన సరే అది శుభం అని కూడా భావిస్తారు.

ఇలాగె కొంత మంది ఎదురు వస్తే వెళ్లే పని సవ్యంగా జరుగుతుంది అని చాల మంది పాటిస్తూ ఉంటారు.కానీ వీటికి ఎక్కడ కూడా శాస్త్రీయత లేదు.

అలాగని కొట్టి పారేసే చిన్న సెంటిమెంట్ కూడా కాదు.కేవలం ఒక నమ్మకం మాత్రమే.

అన్ని సార్లు నిజమవ్వాలని కూడా రూల్ ఏమి లేదు.అయితే ఇప్పటి వరకు చెప్పినవన్నీ పోసిటివ్ కోణం లో చూసేవి.

Advertisement

దేనికి పూర్తి వ్యతిరేకంగా నెగటివ్ కోణం లో చూసేవి కూడా ఉంటాయి.

అందుకు అతి పెద్ద ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు.ABN రాధా కృష్ణ( ABN Radhakrishna ) సపోర్ట్ చేసే ఏ రాజకీయా పార్టీ అయినా కూడా మటాష్ అనే సెంటిమెంట్ ఉంది.అయన సపోర్ట్ చేసిన వారు మట్టి కొట్టుకపోతే అనూహ్యంగా అయన వ్యతిరేకించిన పార్టీ అధికారంలోకి వస్తుంది.

నాటి విజయశాంతి( Vijayashanthi ) పార్టీ నుంచి నేటి షర్మిల ( YS Sharmila ) వరకు అయన చేతిలో బలయిన వారే.అయన ప్రతి రోజు సపోర్ట్ చేస్తూ సగం పేజీ షర్మిల గురించి నింపుతున్నప్పటికీ ఆమె అసలు ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో కూడా అనుమానమే.

ఆమెను కాంగ్రెస్ పార్టీ లో కలవమని ఒక వైపు ఆ పార్టీ వారు అడుగుతుంటే, ఆంధ్ర వెళ్లి రాజకీయాలు చేసుకొమ్మని కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ అంటున్నాడు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

అస్సలు కలుస్తుందో లేదో తెలియని పార్టీ కోసం పొత్తు పెట్టుకుంటుంటే ఎన్ని సీట్స్ ఇవ్వాలో లెక్కలు కూడా చెప్పేస్తున్నారు .ఇది అసలు తెగే తంతు లాగ కనిపించడం లేదు.ఒకరకంగా ఆమె భవిష్యత్తు మరియు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది.

Advertisement

ఇక ఇంతకు ముందే విజయశాంతి కి భయంకరంగా సపోర్ట్ ఇచ్చాడు రాధాకృష్ణ. కానీ ఆమె పార్టీ ఏ విధంగా కనుమరుగు అయ్యిందో అందరికి తెలుసు.

ఇవి మాత్రమే కాదు కోదండరాం పార్టీ, గద్దర్ పార్టీ, ఇంటి పార్టీ అంటూ బోలెడన్ని పార్టీ లు పుట్టుకస్తే అన్నిటికి మద్దతు ఇస్తూ బోలెడంత ప్రచారం చేసి రాధాకృష్ణ వారి పార్టీ లకు మనుగడ లేకుండా చేసారు.ఇక అయన వ్యతిరేకించిన వారంతా అధికారంలోకి రావడం కొసమెరుపు .

తాజా వార్తలు