క్రికెట్ మైదానంలో ఆటతో పాటు కొంతమంది ఆటగాళ్లు చూపించే వినోదాత్మక క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటుంటాయి.
సాధారణంగా సీరియస్ గా సాగే మ్యాచ్‌ల మధ్యలో జరిగే చిన్నపాటి సరదా సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అటువంటి ఓ ఫన్నీ సంఘటన తాజాగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ (Mumbai Indians, Sunrisers Hyderabad)మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది.దీనికి కేంద్ర బిందువుగా నిలిచాడు ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma).
ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో(Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తనదైన శైలి బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.కేవలం 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్, 40 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.
మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 పరుగులు చేశాడు.ఈ ఘనతలో సెంచరీ సాధించిన అనంతరం తన జేబులోంచి ఒక నోట్ బయటకు తీసి అందరికీ చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.
ఆ నోట్‌పై “This one is for Orange Army” అని రాసి ఉంది.తన సెంచరీని అభిమానులకు అంకితమిస్తూ, భావోద్వేగంతో కూడిన సెలెబ్రేషన్‌ను అందుకున్నాడు.
ఈ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
తాజగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో(Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మళ్లీ తన "నోట్"తో వార్తల్లోకి వచ్చాడు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన SRH తరపున ఓపెనర్‌గా అభిషేక్ క్రీజులో ఉన్నాడు.అదే సమయంలో ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సరదాగా అభిషేక్ వద్దకు వచ్చి అతని జేబు చెక్ చేయడం నవ్వులు పూయించింది.
అభిషేక్ వెనకవైపు నుంచి వచ్చి, నిజంగా నోట్ పెట్టుకున్నాడా అన్నట్టుగా జేబులో చెక్ చేసిన సూర్యకు అభిషేక్ కూడా నవ్వుతూ స్పందించాడు.ఈ సరదా సంఘటన సోషల్ మీడియాలో ఫన్నీ క్లిప్‌గా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు.28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు.SRH జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది.
ముంబై బౌలర్లలో జాక్స్ రెండు వికెట్లు తీయగా, బోల్ట్, పాండ్య తలో వికెట్ పడగొట్టారు.చివరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మ్యాచ్‌లో విజయం ఓ పక్క, అభిషేక్ శర్మ "నోట్ సెలెబ్రేషన్" మాత్రం మరోసారి అభిమానుల మనసులను గెలుచుకుంది.
క్రికెట్‌లో ఈ తరహా సరదా క్షణాలు ఆటను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.అభిమానులు కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
క్రీడాభిమానులకోసం ఆట మాత్రమే కాదు, అలాంటి వినోదం కూడా ఉండాలి కదా.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy