సలహాదారుల జాబితాలో ఏబీ .. జగన్ కు  ఇబ్బందులే ?

కొత్తగా ఏపీలో కొలువుతీరిన టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏపీలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది.

ఇప్పటికే అనుకూలమైన ఉన్నతాధికారులను వివిధ విభాగాల్లో నియమించింది.

ఏపీ డిజిపిగా ద్వారకాతిరుమూరుల రావు నియమితులయ్యారు.ఇంకా అనేకమంది ఐఏఎస్ , ఐపీఎస్ లను ఇతర కీలక విభాగాల్లో నియమించారు.

ఇక పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సమర్థులైన వారిని ఏపీ ప్రభుత్వం కొత్త సలహాదారులుగా చంద్రబాబు( Chandrababu ) నిర్ణయించుకున్నారు.

Ab Venkateswara Rao Name In Ap Advisors List Troubles For Ys Jagan Details, Cm C

ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్,  ఐపీఎస్ అధికారులలో తమకు అనుకూలమైన,  సమర్థులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.దీనిలో  భాగంగానే పలువురు రిటైర్డ్ అధికారుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.గతంలో ఆర్థిక , ప్రణాళిక విభాగంలో పనిచేసిన సీనియర్ అధికారి టక్కర్,  అవినీతి నిరోధక శాఖలో పట్టున్న ఆర్పి ఠాగూర్, గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు లను( AB Venkateswara Rao ) సలహాదారులుగా నియమించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Ab Venkateswara Rao Name In Ap Advisors List Troubles For Ys Jagan Details, Cm C
Advertisement
Ab Venkateswara Rao Name In Ap Advisors List Troubles For Ys Jagan Details, Cm C

ఇక ఏపీ వెంకటేశ్వరరావు విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.క్యాట్ ఆదేశించినా గత ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా ఏబీ వెంకటేశ్వరావును పక్కనపెట్టింది .ఆయన రిటైర్డ్ అయ్యే చివరి రోజున పోస్టింగ్ ఇచ్చింది.జగన్ పైన తీవ్రస్థాయిలో పదవి విరమణ చేసిన రోజునే విమర్శలు చేశారు.

ఎవరిని వదిలిపెట్టనని సవాల్ చేశారు.చంద్రబాబుకు అత్యంత నమ్కస్తుడిగా ఆయనకు పేరు ఉండడంతో , ఆయనను ప్రభుత్వ సలహాదారులుగా( Advisors )  నియమిస్తే తమకు కలిసి వస్తుందని చంద్రబాబు  అంచనా వేస్తున్నారట .అదే జరిగితే వైసిపి విషయంలో ఏవీ వెంకటేశ్వరావు తన పంతం నెగ్గించుకున్నట్టే.ఇక మిగిలిన కీలక విభాగాల్లోనూ గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో వేధింపులకు గురై,  అప్రాధాన్య విభాగాల్లో ఉన్న అధికారులకు ఇప్పుడు ప్రాధాన్యం ఉన్న విభాగాల్లో పోస్టింగ్స్ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు