డ్రైవర్ తో యజమానురాలు వివాహేతర సంబంధం.. ఆమెపై డ్రైవర్ హత్యాయత్నం..!

ఇటీవలే అన్ని అక్రమ సంబంధాలు( Extramarital Affairs ) చివరకు జీవితాలలో విషాదాలను నింపుతున్నాయి.

కొద్ది నిమిషాల శారీరక సుఖం కోసం ఏర్పడే బంధాలు ఎన్ని ఏళ్ళు అయినా శాశ్వత బంధాలు కావు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఇలాంటి బంధాల కోసం కుటుంబ బంధాలకు, వివాహ బంధాలకు తీరని అన్యాయం చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఇలాంటి కోవలోనే ఓ వ్యక్తి డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ.

తాను అద్దెకు ఉండే ఇంటి యజమానురాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.అయితే ఆ యజమానురాలు వేరే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమో అనే అనుమానంతో ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడు.

ఈ ఘటన కృష్ణాజిల్లాలోని ముస్తాబాద శివారులో సోమవారం చోటుచేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలను పూర్తిగా చూద్దాం.

Advertisement

వివరాల్లోకెళితే. విజయవాడ( Vijayawada )లోని మారుతీ నగర్ లో ఉండే ఓ ఇంటి పెంట్ హౌస్ లో బర్రె కిరణ్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు.కిరణ్ ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు.

కిరణ్ 15 ఏళ్లుగా ఆ ఇంటి యజమానురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.అయితే ఆ యజమానురాలు ఈమధ్య అర్ధరాత్రి వరకు తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, ఎక్కువసేపు ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఉండడం తో కిరణ్ కు ఆమెపై అనుమానం కలిగింది.

యజమానురాలు తనతోనే కాకుండా మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందేమో అని అనుమానంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.తన ప్లాన్ ప్రకారం బ్యాంకులో పని ఉందంటూ ఆ యజమానురాలును నమ్మించి తన కారులో విజయవాడ నుండి ముస్తాబాద శివారు ప్రాంతానికి తీసుకువచ్చాడు.ప్లాన్ లో భాగంగా ముందుగానే ఓ క్యాన్ లో నాలుగు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి కారులో ఉంచాడు.

చుట్టూప్రక్కల పరిసరాలలో ఎవరూ లేని సమయంలో ఆమెతో వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటావా అంటూ ఆమెతో కారులోనే గొడవపడ్డాడు.అంతేకాకుండా తనతో పాటు తీసుకువచ్చిన కూరగాయలు కోసే చాకుతో ఆమె మెడ పై దాడికి ప్రయత్నించాడు.

ఆమె చేతులు అడ్డం పెట్టుకుని అతనితో గొడవ పడుతూ గట్టిగా కేకలు వేసింది.సమీపంలో ఎన్ హెచ్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు ఆమె కేకలు విని వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కిరణ్( Kiran ) భారీ నుంచి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

ఎయిర్ పోర్ట్ డ్యూటీలో ఉన్న ఎస్సై నాగరాజు కేవలం 10 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొని కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు.భాదితురాలకు స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు