అత్యంత ఎత్తైన ప్రదేశంలో డేంజరస్ పనిచేస్తూ కెమెరాకి చిక్కిన మహిళ..!

సాధారణంగా చాలా ఎత్తైన ప్రాంతాలకు వెళితే చాలు గుండెలు అదురుతాయి.ఎలాంటి సేఫ్టీ వాల్స్ ఉన్నా సరే భయం అనేది పుడుతుంది.

అయితే తాజాగా ఒక మహిళ మాత్రం ఆకాశమంత ఎత్తు ఉన్న ఒక భవంతి పైకి ఎక్కి చివరి అంచున నిల్చోని పనిచేస్తూ కనిపించింది.అంత చివరన నిలుచుంటే ఎవరికైనా సరే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది కానీ ఈ మహిళ మాత్రం ఏం పట్టనట్లు అక్కడ హాయిగా పని చేసుకుంటూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో దాదాపు పది అంతస్తుల అపార్ట్‌మెంటులోని ఒక ఎత్తైన ఫ్లాటులో ఓ మహిళ నిల్చొని ఉండడం చూడవచ్చు.ఆ తర్వాత ఆమె అద్దాలను క్లీన్ చేస్తూ కనిపించింది.ఆమె నడుస్తున్న గోడ చాలా సన్నగా ఉంది.

Advertisement

ఒక్క అడుగు పొరపాటున రాంగ్‌గా వేసినా ఆమె కింద పడే అవకాశం ఎక్కువ.అందులోనూ ఆమె ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ ధరించలేదు.

అయినా చాలా ధైర్యంగా, సరదాగా పనిచేస్తూ కనిపించగా కొంచెం దూరంలో ఉన్న అపార్ట్‌మెంటులోని ఇంకో వ్యక్తి తన ఫోన్ కెమెరాలో దృశ్యాలను బంధించాడు.

తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అది కాస్త వైరల్ అయింది.ఈ వీడియో చూస్తుంటేనే తమకు వెన్నులో వణుకు పుడుతుందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బహుశా ఆమెకు ఓసిడి ఉందేమో అందుకే ఆ దర్టీ అద్దాలను చూడలేక క్లీన్ చేసి ఉంటుందేమో అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.ఆడవాళ్లు ఒకసారి క్లీనింగ్ మొదలుపెడితే మురికి ఎక్కడున్నా సరే వదిలేస్తారని మరొక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఈ షాకింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Advertisement