ఖమ్మం సిటీకి రెండు వైపులా గోడ..: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఈ మేరకు ఇప్పటికే జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.

2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.ఖమ్మం సిటీకి రెండు వైపులా గోడ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

దీంతో ఎంత పెద్ద వరదలు సంభవించినా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.అదేవిధంగా జిల్లాలో మూడు చెక్ డ్యాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దాంతో పాటు మున్నేరులో 365 రోజులు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే మున్నేరుకు కేసీఆర్ రూ.900 కోట్లు కేటాయించారని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players