ఆ ప్రాంతాల్లో ఓటుకి రూ. పది వేలకు పైనే..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుండగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అయితే ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఓటుకు నోటు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఓటుకు సుమారు రూ.పది వేలకు పైగా నగదు పంచుతున్నారని సమాచారం.కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఖమ్మం - ఏపీ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో నగదు పంచుతున్నారని తెలుస్తోంది.

A Vote In Those Areas Is Rs. More Than Ten Thousand..!?-ఆ ప్రాంత�

అయితే ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత పేరు వినిపిస్తోందని తెలుస్తోంది.ఆ సంస్థ అధినేతతో పాటు టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల హస్తం ఉందని సమాచారం.ఈ క్రమంలోనే ఓటుకు సుమారు రూ.12 వేల చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రైస్‌తో ఫేస్ క్రీమ్‌.. రోజు వాడితే మచ్చలేని ముఖ చ‌ర్మాన్ని పొందొచ్చు!
Advertisement

తాజా వార్తలు