సర్పదోషాలను భస్మం చేసే ఆలయం.. ఈ గుడి చుట్టూ పాములు.. ఎక్కడంటే..?

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు.తారకాసుర సంహారం కోసం ఇతను జన్మించాడు.

అలాగే దేవగణానికి సర్వసేనాధిపతిగా కూడా సర్వశక్తిమంతుడు అని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ఆది దంపతులైన శివ, పార్వతులకు కూడా ఆయన ముద్దుల తనయుడు.

అయితే దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చెందిన ఆలయం లో ఆయన కొలువున్నాడు.దక్షిణ ప్రముఖ నాగ క్షేత్రం కుక్కే సుబ్రమణ్యం దేవాలయం( Kukke subramanya swamy ).ఈ కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళితే అక్కడి ఆది సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వాల్మిక మృత్తికా అంటే పుట్టమన్ను ప్రసాద రూపంలో అందిస్తారు.

అయితే మృత్తికా ప్రసాదాన్ని ఎవరు తీసుకుంటారో వారికి నాగుల నుండి భయం ఉండదు.అలాగే నాగ దేవతల నుంచి అనుగ్రహం కూడా లభిస్తుంది.ఇక పెళ్లి విషయంలో ఆడపిల్లలుగాని, మగపిల్లలు గాని పెళ్లి చూపులకు వెళ్లే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి వెళ్లాలి.

Advertisement

అలాగే చిటిక మృత్తికను, మరో చిటిక పసుపును స్నానం చేసే సమయంలో వేడి నీరు కాచే పాత్రలో వేసి ఆ తర్వాత స్నానం చేయాలి.అలా చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించాలి.

ఇలా చేస్తే వివాహం త్వరగా అవుతుంది.అయితే ఈ గుడి చుట్టూ ఎప్పుడూ పాములు ఉంటాయి.ఎందుకంటే ఈ కుక్కే దేవాలయం నాగరాధనకు చాలా ప్రసిద్ధి.

అయితే నాగదేవుని కృపకు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు.

ఈ గుడిలో దర్శించుకున్న వారికి సర్ప దోషాల నుండి విముక్తి లభిస్తుంది.అయితే నాగ క్షేత్ర కుక్కే సుబ్రహ్మణ్యం ఆలయం అక్కడ దక్షిణ భారతదేశంలో నాగ దేవతలకు ప్రసిద్ధి చెందింది.నాగ దోషాల నివారణ( Nagadosha ) కోసం వివిధ ప్రాంతాల నుండి అక్కడికి భక్తులు వస్తారు.

నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!
Advertisement

తాజా వార్తలు