సౌత్ కరోలినాలో వింత జీవి కలకలం... షాక్ అవుతున్న ఎక్స్‌పర్ట్స్‌..

తాజాగా అమెరికాలోని సౌత్ కరోలినా( South Carolina ) నీళ్లలో ఓ వింత జీవి ఈత కొడుతూ కెమెరాకు చిక్కింది.

దీనిని చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ వింత జీవిని పావ్లీస్ ద్వీపంలోని ఒక వంతెన దగ్గరకు వెళ్లిన స్థానికుడు తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.అబ్బురపరిచే ఈ ఫుటేజీని టీవీ స్టేషన్‌కు సెండ్ చేసాడు.

టీవీ వారి సైతం ఈ జీవి ఏంటో తెలియక తల గీక్కున్నారు.తర్వాత వారు ఆ వీడియోను సౌత్ కరోలినా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్( Department of Natural Resources ) (DNR)కి కోసం ఫార్వార్డ్ చేశారు.

DNR ప్రతినిధి దీనిని చూసే తాను స్టన్ అయ్యానని చెప్పుకొచ్చారు.సహాయం కోసం నిపుణులను సంప్రదించారు.

Advertisement

అయితే ఈ జీవి ఏంటనేది ఎవరూ కూడా గుర్తించలేకపోయారు.చివరికి ఈ వీడియోను విశ్లేషణ కోసం చార్లెస్టన్‌లోని మెరైన్ రిసోర్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు.

తర్వాత ఒక నిపుణుడు ఈ వీడియో ఫుటేజ్ ని అందుకున్నారు.ఆ జీవిని సముద్రపు కుందేలు లేదా సీ స్లగ్‌గా ఆయన గుర్తించాడు.

సీ స్లగ్‌ సాధారణంగా చాలా పెద్దదిగా ఉంటుంది, ఇది నీటిలో ఈదుతుంది.

అయినప్పటికీ, ఈ జాతిని దక్షిణ కరోలినా జలాల్లో కనుగొనడం అసాధారణం.ఎందుకంటే అవి సాధారణంగా ఫ్లోరిడా లేదా వెస్ట్ కోస్ట్‌లో( Florida or the West Coast ) కనిపిస్తాయి.వెచ్చని జలాల కారణంగా ఈ సముద్రపు స్లగ్‌లు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఉండవచ్చని నిపుణులు ఊహించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

WCNC అనే యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క జీవి పేరు చెబుతున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు