మీ స్కిన్ ను తెల్లగా మార్చే సింపుల్ రెమెడీ.. రిజ‌ల్ట్ చూస్తే అస్సలు వ‌ద‌ల‌రు!

త‌మ చ‌ర్మాన్ని తెల్ల‌గా, మ‌ల్లెపువ్వు మాదిరి మెరిపించుకోవాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు అందుకోసం త‌హ‌త‌హ‌లాడుతుంటారు.

ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్‌, సీర‌మ్స్‌, లోష‌న్స్ వంటివెన్నో ప్రోడెక్ట్స్‌ను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.అయితే వాటితో ఎంత ప్ర‌యోజ‌నం ఉంది అన్న‌ది ప‌క్క‌న పెడితే.

ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీ మాత్రం త‌ప్ప‌కుండా మీ స్కిన్‌ను తెల్ల‌గా, ప్ర‌కాశ‌వంతంగా మారుస్తుంది.ఒక్క‌సారి ఈ రెమెడీ రిజ‌ల్ట్ చూస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక గిన్నెలో నాలుగైదు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి రెండు సార్లు నీటితో క‌డిగి.

Advertisement
A Simple Remedy To Whiten Your Skin , Simple Remedy, Skin Care, Skin Care Tips,

ఆపై అందులో గ్లాస్ వాట‌ర్ పోసి మూడు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.ఇలా నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని.

జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ పాలు పోయాలి.

పాలు హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల లెమ‌న్ పీల్ పౌడ‌ర్ వేసి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ త‌ర్వాత ఇందులో రైస్ వాట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించుకుని.

చ‌ల్లార‌బెట్టుకోవాలి.

A Simple Remedy To Whiten Your Skin , Simple Remedy, Skin Care, Skin Care Tips,
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

పూర్తిగా కూల్ అయ్యాక అప్పుడు అందులో వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌ను యాడ్ చేసి. ముఖానికి, మెడ‌కు కావాలి అనుకుంటే చేతుల‌కు అప్లై చేసుకోవాలి. ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అయిన అనంత‌రం సున్నితంగా వేళ్ల‌తో రుద్దుకుంటూ చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు కాంతివంతంగానూ మారుతుంది.

తాజా వార్తలు