ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మేకప్ కూడా అక్కర్లేదు.. సహజంగానే తెల్లగా కాంతివంతంగా మెరుస్తారు!

ఇటీవల రోజుల్లో మగువలు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.కొందరు పురుషులు కూడా మేకప్ వేసుకుంటున్నారనుకోండి.

అది పక్కన పెడితే మేకప్ అనేది డైలీ రొటీన్ లో భాగం అయిపోయింది.కానీ దీర్ఘకాలికంగా మేకప్ ఉత్పత్తుల‌ను వాడటం వల్ల చర్మ ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంది.

అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి.స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది.

అందుకే సహజంగానే అందంగా మెరిసేందుకు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

ఈ చిట్కాను పాటిస్తే మేకప్ అక్కర్లేదు.సహజంగానే తెల్లగా కాంతివంతంగా మెరుస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బాగా ఎండిన గులాబీ రేకులు( Rose Flowers ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్.రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్.వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ).వన్ టేబుల్ స్పూన్ తేనె.రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్( Tomato juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

\ రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.స్కిన్ యవ్వనంగా మెరుస్తుంది.

మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

స్కిన్ టైట్ గా బ్రైట్ గా మారుతుంది.

తాజా వార్తలు