ఆ ఒరిజినల్ ఐఫోన్ మోడల్ ధర ఏకంగా రూ. 1.3 కోట్లకి అమ్ముడుపోయింది!

ఆశ్చర్యంగా వుంది కదూ.అవును, మీరు విన్నది నిజమే.

అసలు విషయంలోకి వెళ్లేముందు ఇక్కడ మొదలు కధ గురించి మాట్లాడుకోవాలి.

ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ప్రవేశ పెట్టడం ద్వారా స్టీవ్ జాబ్స్( Steve Jobs ) స్మార్ట్‌ఫోన్లలో విప్లవాత్మక ప్రస్ధానానికి తెరలేపారనే విషయం అందరికీ తెలిసినదే.

టచ్‌స్క్రీన్‌, మ్యూజిక్‌, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఎన్నో ఫీచర్లతో మొదటి మొబైల్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా రూపాంతరం చెందింది.అందుకే ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ ఫోన్‌కు( iPhone First Generation ) అంతటి ప్రజాదరణ.

ఇకపోతే, ఫ్యాక్టరీ సీల్డ్ ఒరిజినల్ ఐఫోన్ అంటే జనాలలో వున్న క్రేజే వేరు.సీల్ తీయని ఐఫోన్లు వేలంలో రూ.లక్షలు ధరలు పలకడం మనం అనేకసార్లు చూశాం.

A Sealed-in-box First-generation Iphone Has Been Auctioned For An Record Price D
Advertisement
A Sealed-in-box First-generation IPhone Has Been Auctioned For An Record Price D

అదంతా ఒకెత్తయితే, తాజాగా జరిగిన ఒక ఐఫోన్ వేలం( iPhone Auction ) రికార్డు స్థాయిలో ధర పలికి చూపరులకు షాక్ ఇచ్చింది.అవును, ఇటీవలి వేలంలో ఐఫోన్ తొలి జనరేషన్ డివైజ్ అత్యధిక విలువ కలిగిన ఐఫోన్‌గా వార్తల్లో నిలిచింది.తొలి జనరేషన్ 4జీబీ వెర్షన్ ఐఫోన్ ఎల్‌సీజీ వేలంలో ఏకంగా రూ.1.3 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.ఈ అరుదైన 4జీబీ మోడల్‌కు జూన్ 30న పదివేల డాలర్లతో బిడ్డింగ్ మొదలవ్వడం గమనార్హం.ఆపై అత్యధిక డిమాండ్‌తో కొద్దిరోజుల్లోనే ధర పెరుగుతూ గత రికార్డు రూ.51.6 లక్షలను అధిగమించింది.

A Sealed-in-box First-generation Iphone Has Been Auctioned For An Record Price D

ఇకపోతే, 2007లో లాంఛ్ అయిన ఈ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ ధర రూ.40,000గా మాత్రమే.అయితే తాజా వేలంతో గత 16 ఏండ్లలో 4జీబీ వేరియంట్ విలువ ఏకంగా 318 రెట్లు పెరగడం సంస్థ అధినేతలకే షాక్ ఇచ్చింది.

బాక్స్ ఓపెన్ చేయని ఈ ఒరిజినల్ ఐఫోన్ మోడల్ 4జీబీ వేరియంట్ ఫ్యాక్టరీ సీల్‌తో చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం.అద్భుతమైన కలర్‌, గ్లాస్‌తో పాటు ఎన్నడూ యాక్టివేట్ చేయని బ్రాండ్ న్యూ మోడల్ అని వేలం నిర్వాహకులు చెబుతూ వేలాన్ని నిర్వహించారు.

కాగా ఈ వేలానికి చాలా దేశాలకు చెందిన ఔత్సాహికులు బిడ్ చేసినట్టు తెలుస్తోంది.అందులో మన భారతీయులే పదిమంది దాకా పోటీపడడం కొసమెరుపు.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Advertisement

తాజా వార్తలు