Dog Donations : అందంగా ముస్తాబై.. విరాళాలు సేకరిస్తున్న కుక్క పిల్ల!

జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.ముఖ్యంగా కుక్క పిల్లలను అంతా ఎంతో ఇష్టపడుతుంటారు.

ముద్దు ముద్దుగా ఉండే చిన్న చిన్న కుక్క పిల్లలు ఎవరినైనా ఆకర్షిస్తాయి.వాటిని చూడగానే, అవి చేసే అల్లరి పనులు గమనించగానే నవ్వు పుట్టుకొస్తుంది.

అలాంటి కుక్క పిల్లలను పెంచుకోవాలని చాలా మంది భావిస్తారు.అయితే అందరికీ అది సాధ్యం కాదు.

దీంతో ఎక్కడైనా ఏదైనా చిన్న కుక్క పిల్లలను గమనిస్తే వాటిని ముద్దు చేస్తుంటారు.తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement

ఓ చిన్న కుక్క పిల్ల చాలా అందంగా ముస్తాబు అయి, రోడ్డులో విరాళాలు సేకరిస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

విరాళాలు సేకరించడం ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చేపడుతుంటారు.మనుషులు విరాళాలు చేపట్టడం మనం చూసి ఉంటాం.అయితే ఆశ్చర్యకరంగా ఓ కుక్క పిల్ల బాగా అందంగా రెడీ అయింది.

సన్ గ్లాసెస్ ధరించి, నోటిలో సిగార్ పైపు పెట్టుకుని ఠీవిగా నిల్చుంది.తలపైన క్యాప్ కూడా ధరించింది.

రోడ్డు మీద రెడ్ కార్పెట్‌పై కూర్చుని, తన ముందు పిగ్గీ బ్యాంకు పెట్టుకుంది.ఓ బోర్డు పెట్టుకుని విరాళాలు ఇవ్వండి అని కోరుతోంది.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

బీచ్‌లో ఆ కుక్క పిల్లను చూసిన వారంతా బాగా ముచ్చటపడి దానిని పలకరించారు.ఆ పిగ్గి బ్యాంకులో ఓ యువతి కొంత మొత్తం విరాళం అందించగానే దానికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

Advertisement

మరో యువతి వచ్చి ఆ కుక్క పిల్లను పలకరించింది.షేక్ ఇవ్వడానికి యువతి ప్రయత్నించగానే ఆ కుక్క పిల్ల ఇవ్వలేదు.

పక్కన ఉన్న వారు విరాళం ఇస్తేనే ఆ కుక్క పిల్ల షేక్ హ్యాండ్ ఇస్తుందని ఆమెకు చెప్పారు.అయితే ఆమె వద్ద డబ్బులు చేతిలో లేకపోవడంతో అయ్యో అనుకుంది.

ఇలా ఆ కుక్క పిల్ల అందరినీ అలరించింది.ఈ వీడియోను Lo+Viral అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగానే బాగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు