చుండ్రుతో మదన పడుతున్నారా? ఇలా చేస్తే ఒక్క దెబ్బకే పోతుంది!

చుండ్రు( dandruff ).ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.

చుండ్రు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్.

వాతావరణంలో వచ్చే మార్పులు, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఏర్పడుతుంది, దీని కారణంగా తలలో తీవ్రమైన దురద పుడుతుంది, అలాగే చుండ్రు కారణంగా జుట్టు అధికంగా రాలడం, డ్రై గా మారడం జరుగుతుంది.

అంతే కాదు తలలో చుండ్రు ఉంటే ముఖంపై మొటిమలు కూడా వస్తుంటాయి.అందుకే చుండ్రు సమస్యను నివారించుకోవడం కోసం ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఒక్క దెబ్బకే చుండ్రును మాయం చేసే పవర్‌ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.మ‌రి ఆ రెమెడీ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు రెబ్బలు కరివేపాకు( curry leaves ), మూడు రెబ్బలు వేపాకు( Neem ), పది ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ) వేసుకుని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

A Powerful Remedy To Get Rid Of Dandruff Quickly , Home Remedy, Dandruff, Latest
Advertisement
A Powerful Remedy To Get Rid Of Dandruff Quickly , Home Remedy, Dandruff, Latest

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

A Powerful Remedy To Get Rid Of Dandruff Quickly , Home Remedy, Dandruff, Latest

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది.స్కాల్ప్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు పోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా సైతం ఉంటుంది.కాబట్టి చుండ్రు సమస్యకు స్వస్తి పలకాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు