రైలు ప్రయాణంలో టికెట్ లేకున్నా టీటీని బెదిరించిన ప్రయాణికుడు.. (వీడియో)

సాధారణంగా మనం ట్రైన్‌లో ప్రయాణించాలంటే కచ్చితంగా టికెట్ ఉండాలి.

ఒక్కో సారి టికెట్ లేని ప్రయాణికులు( Passengers ) చాల మంది టీటీని కనిపించకుండా పలు జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు.

అలాగే ఇంకా కొంత మంది అయితే ఫైన్ చెల్లిస్తామని చెప్పి బెర్త్ కోసం రిక్వెస్ట్ చేస్తారు.ఇలాంటి సంఘటనలు తరచూ ట్రైన్‌లో మనం చేస్తూనే ఉంటాం .అయితే తాజాగా ఒక వ్యక్తి మాత్రం ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి దర్జాగా బెర్త్‌పై కూర్చుని ఉన్నాడు.

టీటీ వచ్చి అతనికి టికెట్ అడిగినప్పుడు, అతను "నేను రైల్వే డీఆర్ఎం మేనల్లుడిని.బక్సర్‌కు వెళ్లాలి" అని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరచాడు.ఆ వ్యక్తి చూడటానికి క్లాస్‌గా కనిపిస్తున్నాడు, కానీ టికెట్ లేకుండా రిజర్వేషన్ బోగీలో ( reservation bogie )ప్రయాణించడం సరికాదు అని టీటీ అతన్ని అడగడం మొదలు పెట్టాడు .అందుకు అతను "నేను టికెట్ అడుగుతావా?" అని దబాయించేందుకు కూడా ప్రయత్నం చేసాడు.ఈ వాగ్వాదం రికార్డ్ చేసి, ఇంకో ప్రయాణికుడు అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వీడియో వైరల్ అయ్యింది.

ఈ తరుణలో టీటీ సదరు యువకుడ్ని ఏసీ కోచ్ ( AC coach )నుంచి బయటకు పంపే ప్రయత్నం కూడా చేసినటు మనం వీడియోలో చూడవచ్చు .అయితే సదరు ప్రయాణికుడు చెబుతున్నట్లుగా రైల్వే డీఆర్ఎం బంధువే అనుకొని భయాందోళనకు గురైనట్టు కూడా మనం చూడవచ్చు.ఈ వీడియోను చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

అధికారం ఉంటె ఏమైనా చేస్తారా అని కొందరు అంటూ ఉంటె.మరికొందరు ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ది చెప్పాలి అని రాసుకొని వచ్చారు.

పబ్లిక్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్
Advertisement

తాజా వార్తలు