విమానంలో భిక్షాటన చేస్తున్న రాజకీయ నాయకుడు.. ఎందుకో తెలిస్తే షాక్..

దేవాలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం బిచ్చమెత్తుకునేవారిని( Beggars ) చూస్తూ ఉంటాం.మనకు ఇష్టముంటే తోచినంత సహాయం చేస్తూ ఉంటాం.

లేకపోతే సైలెంట్ గా లేవని చెబుతాం.కానీ ఇటీవల హైటెక్ బిచ్చగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు.

విమానాల్లో కూడా చివరికి భిక్షాటన చేస్తున్నారు.తాజాగా పాకిస్తాన్ లో( Pakistan ) ఓ ఫ్లైట్‌లో ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను మెగా అప్డేట్స్ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేశాడు.దీంతో ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.

Advertisement

ఫ్లైట్‌లో భిక్షాటన ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ వ్యక్తి విమానంలో భిక్షాటన చేయడం వెనుక ఒక కారణం ఉందట.అదేంటంటే.మదర్సా నిర్మించేందుకు( Madarsa ) ఇలా భిక్షాటన చేస్తున్నాడు.

ఈ విషయాన్ని అతడే స్వయంగా చెబుతున్నాడు.లాహోర్‌లో మదర్సా నిర్మించేందుకు భిక్షాటన చేస్తున్నట్లు చెబుతున్నాడు.

నీలం రంగు జాకెట్, తెల్లి కుర్తా పైజమా ధరించి ఫ్లైట్‌లో భిక్షాటన చేస్తున్నాడు.ఫ్లైట్‌లో నిలబడి డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాడు.

మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

తాను మదర్సా నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్నానని, దయచేసి మీకు తోచినంత సహాయం చేయాలని కోరుతున్నాడు.

Advertisement

ఎవరైనా తనకు విరాళం ఇవ్వాలనుకుంటే తన దగ్గరకు రావొద్దని, తానే మీ సీటు దగ్గరకు వస్తానంటూ వీడియోలో చెబుతున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.అతడి పేరు అక్తర్ లావాగా గుర్తించారు.

అతడు పాకిస్తాన్ లో వ్యాపారం చేసుకోవడంతో పాటు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది.పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం( Financial Crisis ) తీవ్రతరం అవుతుంది.

ఆహార పదార్థాల ధరలు పెరగడంతో జనాలు తెగ ఇబ్బంది పడుతున్నారు.పారిశ్రామికంగా కూడా దేశం దిగజారిపోయింది.

ఇలాంటి తరుణంలో ఈ వీడియో బయటకు రావడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

తాజా వార్తలు