జపమాలను తలపించే సరికొత్త వస్తువు.. నెటిజన్ల మిశ్రమ స్పందన

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ గా ఆలోచిస్తూ వారి పనులను స్మార్ట్ పద్ధతిలో పూర్తి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

పొద్దున లేచినప్పుడి నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇంకా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడుతూ మన జీవితాన్ని మరింత స్మార్ట్ గా తయారు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.

అయితే ఇక్కడ మనుషుల్ని యంత్రాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయన విషయం మాత్రం పట్టించుకోవడం మర్చిపోతున్నాం.మనమందరం ప్రస్తుత కాలంలో చేతిలో కానీ.

వినియోగంలో కానీ.స్మార్ట్ వస్తువులు లేకపోతే క్షణం కూడా గడపలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం ఏ పని కావాలన్నా కచ్చితంగా స్మార్ట్ పరికరాలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకవైపు ఇలా ఉండగా ఎన్ని స్మార్ట్ వస్తువులు వచ్చిన అది ఆధ్యాత్మిక వైపు రాలేదని సంతోషపడాలి.

A New Item That Reminds Us Of Japamala Mixed Reaction From Netizens , Japamala
Advertisement
A New Item That Reminds Us Of Japamala Mixed Reaction From Netizens , Japamala

అయితే ఇప్పుడు ఆ ఆనందం కాస్త ఆవిరయ్యే ఓ కొత్త పరికరం జనాల ముందుకు వచ్చేసింది.అదేదో కాదండోయ్.స్మార్ట్ జపమాల( Japamala ) అవును మీరు విన్నది, చదివింది నిజమే.

జపమాల ఏంటి.? అది కూడా స్మార్ట్ జపమాల ఏంటి అని ఆలోచిస్తున్నారా.? అవునండి కొత్తగా వచ్చిన స్మార్ట్ జపమాలను చూస్తే మాత్రం మీరు కూడా., ఓరి దేవుడా.

అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే.ఇకపోతే ఇందుకు సంబంధించిన ఆవిష్కరణ గురించి మాట్లాడితే.

A New Item That Reminds Us Of Japamala Mixed Reaction From Netizens , Japamala

చేతి వేళ్ల మధ్య జపమాల తిప్పినట్టు భావన అచ్చం కలిగించేలా బొడిపెలు ఉన్న ఓ చిన్నచక్రాన్ని తయారుచేసి దానికి కౌంటింగ్ యంత్రాన్ని అమర్చడం ద్వారా స్మార్ట్ జపమాలను తయారు చేశారు.అచ్చం మనం జపమాలనే ఒక పూస తర్వాత ఒక పూస లెక్కపెడుతూ దేవుని నామస్మరణ చేస్తాము.అలాగే పూసల దండ తిప్పినట్టుగా వేళ్ళ మధ్య ఆ డిజిటల్ స్మార్ట్ యంత్రాన్ని( Digital smart machine ) పెట్టుకొని తిప్పుతూ ఉన్న కూడా అలాంటి అనుభవమే ఇస్తోంది ఈ మిషన్.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ప్రస్తుతం ఈ మిషన్ సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన జనాలు ఒకింత ఆశ్చర్యానికి లోనైరని చెప్పవచ్చు.

Advertisement

కొందరు జపమాల పవిత్రను దూరం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా.మరికొందరు మాత్రం ఈ ఐడియా సూపర్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

మొత్తానికి స్మార్ట్ యుగంలో ఇలాంటి పరికరాలు సృష్టించడం వల్ల సంతోషించాలో లేక దుఃఖించాలో అర్థంకాని పరిస్థితుల్లో జనాలు బతికేస్తున్నారు.

తాజా వార్తలు