Google Maps : గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..?

గూగుల్ మ్యాప్స్( Google Maps ) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది.

ఈ ఫీచర్ తో నగరాలలో ఉండే పెద్ద పెద్ద భవనాలకు ఎంట్రెన్స్ కనుగొనడంలో ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.నగరంలోని ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ ను ఎంచుకొని, మ్యాప్ లో జూమ్ ఇన్ చేసినప్పుడు, మీరు ఆ భవనంలోకి ఎక్కడ ప్రవేశించాలో చూపించే గుర్తు కనిపిస్తుంది.

మీరు ఎంచుకున్న భవనాలు ఎరుపు రంగులోకి మారుతాయి.వాటిని ప్రత్యేకంగా కూడా చూపిస్తాయి.

A New Feature In Google Maps How Does This Feature Work

గూగుల్ మ్యాప్స్ లో ఎంచుకున్న భవనం యొక్క ప్రవేశాలు వృత్తాకార చిహ్నంతో బాణం గుర్తుతో కనిపిస్తాయి.లేదంటే ప్రవేశ చిహ్నంతో తెల్లటి వృత్తంతో గుర్తించబడతాయి.ఈ సరికొత్త ఫీచర్ ను శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వెగాస్, బెర్లిన్, న్యూయార్క్ నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లు, ఆఫీసులు, కేఫ్ లు, వ్యాపార బిల్డింగ్ లలో పరీక్షించడం జరిగింది.

Advertisement
A New Feature In Google Maps How Does This Feature Work-Google Maps : గూగ

ఈ ఫీచర్ కొన్నిచోట్ల అనుకున్న విధంగానే పనిచేసింది.కానీ కొన్నిచోట్ల మాత్రం పనిచేయలేదు.

A New Feature In Google Maps How Does This Feature Work

ప్రస్తుతానికి ఈ ఫీచర్ చిన్న భవనాలకు కాస్త ఉపయోగకరంగా లేదు కానీ పెద్ద పెద్ద మాల్స్ లేదా ఆస్పత్రులు, భవనాలకు ఉపయోగకరంగా ఉంది.ఈ ఫీచర్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.

గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే వారందరికీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ తో పాటు గూగుల్ మ్యాప్స్ కి గ్లాన్సబుల్ డైరెక్షన్స్ లాంటి అద్భుతమైన ఫీచర్లను కూడా జోడిస్తోంది.

దీంతో ఫోన్ లాక్ చేయబడినప్పుడు కూడా మీకు దిశలను చూపిస్తుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు