కడప జిల్లాలో ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్య..!

కడప లోని ఎన్జీవో కాలనీలో తాటిచెర్ల లక్ష్మి (45)( Lakshmi ) అనే వివాహిత అక్రమ సంబంధం కొనసాగించిన ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ హత్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం. కడప జిల్లా( Kadapa district )లోని ముద్దనూరుకు చెందిన తాటిచెర్ల లక్ష్మి, నారాయణస్వామి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. నారాయణస్వామి అనారోగ్యం కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు.

మూడేళ్ల క్రితం పెద్ద కుమార్తె నవీన కు వివాహం చేసి, కడపలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది.ఈ మధ్యనే రెండవ కుమార్తె సస్మిత కు కూడా వివాహం చేసింది.

Advertisement

అయితే అదే ప్రాంతంలో బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్న జమ్మలమడుగు కు చెందిన ఆవుల రామాంజనేయులుతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధా( Extramarital Affiar )నికి దారితీసింది.ఇక అతనితో కలిసి కూలి పనులకు వెళ్తూ, వివాహేతర సంబంధం కొనసాగించింది.

అయితే కొన్ని రోజుల నుండి వీరి మధ్యలో మనస్పర్ధలు మొదలయ్యాయి.

లక్ష్మి అడ్డును తొలగించుకోవాలి అనుకున్న ఆవుల రామాంజనేయులు ఆమెను హత్య చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించాడు.ప్లాన్ లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి లక్ష్మీ ఇంటికి వెళ్లి.గాడ నిద్రలో ఉన్న లక్ష్మీ పై రోకలి బండతో దాడి చేసి హత్య చేశాడు.

వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు.మరుసటి రోజు వరకు ఈ విషయం బయటకు తెలియలేదు.

కానీ శనివారం రాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు.లక్ష్మీ కుమార్తె నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఆవుల రామాంజనేయులు ను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు