దగ్గరలో ఏదైనా పామును చూస్తేనే చాలా మంది భయపడి పరుగులు తీస్తారు.అలాంటిది అడవిలోకి వెళ్తే అక్కడ ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి.
వాటి సమీపంలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సంచరించడం అంటే చాలా ధైర్యం కావాలి.ఏ మాత్రం తేడా వచ్చినా క్రూర జంతువులు మనుషులను చంపి తినేసే ప్రమాదం ఉంది.
కొందరు మాత్రం ఏ మాత్రం భయపడకుండా అడవులలో సంచరిస్తున్నారు.వైల్ట్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు( Wildlife photographers )అయితే జీపులలో సఫారీ టూర్లకు వెళ్తుంటారు.
అడవి జంతువులను అతి సమీపం నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తారు.ఇటీవల ఇలాగే సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ ఫొటోగ్రాఫర్‌కు వింత అనుభవం ఎదురైంది.
ఓ సింహం అతడి దగ్గరగా వచ్చింది.అక్కడే అనూహ్య ఘటన జరిగింది.
దానికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.
అడవి గుండా వెళ్లే రహదారిపై అడవి జంతువులు( wild animals ) అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తుంటాయి.మనుషులకు అత్యంత సమీపంలో నుంచి అవి వెళ్తుంటాయి.ఇదే కోవలో ఓ వ్యక్తి సఫారీ టూర్‌కి వెళ్లాడు.
జీపుపై కూర్చుని అక్కడ కనిపించిన దృశ్యాలను ఫొటోలు తీయసాగాడు.ఇంతలో ఓ భారీ సింహం అతడి సమీపంలోకి వచ్చింది.
మరింత ముందుకు వచ్చి అతడి వైపు చూసింది.అయితే ఆ ఫొటోగ్రాఫర్ ఏ మాత్రం భయపడలేదు.
ఆ సింహం కళ్లల్లోకి కళ్లు పెట్టి తీక్షణంగా చూశాడు.ఆశ్చర్యకరంగా ఆ సింహం అతడిపై దాడి చేయలేదు.
ఒక గాండ్రింపు తర్వాత అక్కడ నుంచి నిదానంగా వెళ్లిపోయింది.ఈ వీడియోను latestkruger అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, విపరీతంగా వైరల్ అవుతోంది.
దీనికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.కళ్లల్లోకి చాలా ధైర్యంగా చూసి సింహాన్ని భయపెట్టేశాడని వ్యాఖ్యానిస్తున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy