వెరైటీగా ప్రెజర్ కుక్కర్లను బాగు చేస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..

షాప్స్‌లో పనిచేసే వారు ఒక రోబో లాగా పని చేస్తుంటారు.వారి దగ్గర చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి.

త్వరగా పని అయిపోయే చేసి కస్టమర్లను త్వరగా ఇంటికి పంపించేసే నైపుణ్యాలు వీరి సొంతమని చెప్పుకోవచ్చు.యమా ఫాస్ట్‌గా పని చేసే వీరికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.

అవి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.మళ్ళీ వారిని ఆశ్చర్యపరిచే ఒక వర్కర్ వీడియో సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఆ వ్యక్తి మిక్సర్, ప్రెషర్ కుక్కర్( Pressure Cooker ), ఫ్రైయింగ్ పాన్ రిపేర్ చేస్తున్నాడు.అందరి వలె కాకుండా అతడు అసాధారణమైన పద్ధతులతో రిపేర్ చేస్తున్నాడు.అద్భుతమైన వేగం తన సొంతం అన్నట్లు పనిచేస్తున్నాడు.

Advertisement

చాలా మంది ఈ వీడియో చూసి అతనొక ‘ఫాస్టెస్ట్ ఫిక్సర్’ అని ప్రశంసిస్తున్నారు.మరికొందరు ‘10 బిజినెస్ డేస్ ఇన్ వన్’ అని ఫన్నీగా కామెంట్ చేశారు.

అంటే పది రోజుల్లో చేయాల్సిన పని ఒక్కరోజులోనే అతడు పూర్తి చేస్తున్నాడని చమత్కరించారు.

ఈ వర్కర్ కొన్ని సెకన్లలో కుక్కర్, ఫ్రైపాన్‌ను రిపేర్ చేయడం వైరల్ అవుతున్న వీడియోలో మనం చూడవచ్చు.దీనికి సంబంధించిన వీడియోను @chotutufan ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ షేర్ చేసింది.ఆ వీడియోలో అతను వంట సామాగ్రిని( Kitchen Utensil ) రిపేర్ చేసేటప్పుడు రకరకాల పరికరాలను శరవేగంగా వాడేశాడు.

ఓ రాడ్‌తో కొట్టడం ద్వారా పాన్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు.ఒక మిక్సర్‌ని, దాని తర్వాత ప్రెషర్ కుక్కర్‌ని ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

కస్టమర్లు ఏం రిపేర్ వచ్చిందనేది చెప్పకుండానే అతడు తెలుసుకుని వాటిని బాగు చేసి వాటిని ఇచ్చేస్తున్నాడు అలాగే టెస్ట్ చేసి మరీ అవి రిపేర్ అయ్యాయి అని వారి కళ్ళముందే నిరూపిస్తున్నాడు.వీడియో అంతటా, ప్రజలు ఈ అసాధారణ రిపేర్ మాన్ వర్క్‌ను రికార్డింగ్ చేయడం చూడవచ్చు.

Advertisement

వీడియోకు ఇప్పటికే ఇరవై ఒక్క లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు