కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చిన కొడుకు.. క‌న్నీరు పెట్టిస్తున్న ఘ‌ట‌న‌!

ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.రోజు రోజుకు మ‌రింత వేగంగా విజృంభిస్తూ.

మ‌రిన్ని ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది.ఆర్థికంగా సైతం ఎంద‌రినో తుడిచి పెట్టేసిన ఈ క‌రోనా వైర‌స్‌.

A Man Commits Suicide Due To Business Loss! Suicide, Business Loss, Father And S

అంతం కోసం ప్ర‌పంచ‌దేశాలు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.కానీ, క‌రోనా వైర‌స్‌కు అడ్డుక‌ట్టే వేసే వ్యాక్సిన్ ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులోకి రాలేదు.

అసలు ఎప్పుడు వ‌స్తుందో కూడా స్ప‌ష్టం లేదు.మ‌రోవైపు ఈ ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.

Advertisement

ఎన్నో కుటుంబాల్లో క‌న్నీళ్లు మిగుల్చుతుంది.తాజాగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆర్థికంగా న‌ష్ట‌పోయిన ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

అయితే తాను తాగ‌డంతో పాటు.క‌రోనా రాకుండా ఉండే మందంటూ త‌ల్ల‌దండ్రుల‌కు కూడా విష‌మిచ్చాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.బంజారాహిల్స్‌ హిల్స్‌ కాలనీలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో అల్లంపాటి రామిరెడ్డి, శ్రావణి రెడ్డిలు దంప‌తులు నివ‌సిస్తున్నారు.

వీరికి అనీష్‌ రెడ్డి కుమారుడు ఉన్నాడు.అనీష్ ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు ర‌న్ చేస్తూ.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!

కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో.

Advertisement

ఆరేడు నెల‌ల క్రితం ఐటీ కంపెనీలు మూత‌ప‌డ్డారు.దీంతో అనీష్ క్యాంటీన్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్న‌ది.

దీంతో ఆర్థికంగా ప‌త‌న‌మైపోయిన అనీష్ చ‌నిపోయేందుకు సిద్ధం అయ్యారు.అయితే తాను చ‌నిపోతే త‌ల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో.కానీ, అనీష్‌ రెడ్డి బుధవారం రాత్రి విషాన్ని ఇంటికి తీసుకువ‌చ్చి క‌రోనా మందంటూ న‌మ్మించారు.అనంత‌రం తండ్రికి ముందుగా విషం తాగించి.

త‌ల్లికి ఇవ్వ‌గా, ఆమె వంట ప‌ని పూర్తి అయ్యాక తాగుతాన‌ని చెప్పింది.దీంతో అనీష్‌ రెడ్డి తాగేశాడు.

కొన్ని నిమిషాల‌కు తల్లి వంటగది నుండి బయటకు రాగా భ‌ర్త‌, కొడుకు స్రృహ కోల్పోయి క‌నిపించారు.దీంతో శ్రావణి ఇరుగుపొరుగు వారిని పిలిచి.

ఇద్ద‌రినీ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే అనీష్ మృతి చెందాడు.ప్ర‌స్తుతం తండ్రి రామిరెడ్డికి చికిత్స అందిస్తున్నారు.

తాజా వార్తలు