'గాంధీ జయంతి' ప్రాజెక్ట్ చేసుకురమ్మని స్కూల్ లో అంటే..ఆ చిన్నారి ఎంత కొంపముంచే పని చేసిందో తెలుసా.?

నేటి త‌రుణంలో స్కూళ్ల‌లో చిన్నారుల‌కు ప‌లు ర‌కాల అంశాల‌పై ప్రాజెక్టులను ఇస్తున్నారు తెలుసు క‌దా.అవును, అవే.

అయితే ఏ ప్రాజెక్టు అయినా దానికి కావ‌ల్సిన ఫొటోలు, స‌మాచారాన్ని విద్యార్థులు సేక‌రించి అన్నింటినీ ఒక్క చోట చేర్చి ప్రాజెక్టు స‌మ‌ర్పించాలి.అందులో భాగంగానే ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా.? అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి ప్రాజెక్టు ఇచ్చార‌ని చెప్పి గాంధీ బొమ్మ‌ల కోసం ఏకంగా క‌రెన్సీ నోట్ల‌నే క‌ట్ చేసింది.అనంత‌రం ఆ బొమ్మ‌ల‌ను కార్డు బోర్డుపై అంటించింది.

దానిపై అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి అని రాసింది.కింద ఇచ్చిన చిత్రంలో ఉన్న‌దే ఆ ఫొటో.

ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఎవ‌రు తీశారో, ఏ ప్రాంత‌మో తెలియ‌దు కానీ ఈ ఫొటో మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌లనంగా మారింది.ఆ చిన్నారి అలా క‌రెన్సీ నోట్ల‌పై ఉన్న గాంధీ బొమ్మ‌ల‌ను క‌ట్ చేసి ఎంచ‌క్కా కార్డు బోర్డుపై అంటించ‌డాన్ని మ‌నం క్లియ‌ర్‌గా చూడ‌వ‌చ్చు.మొత్తం 8 రూ.2వేల నోట్లు, 6 రూ.500 నోట్ల‌ను ఆ చిన్నారి క‌ట్ చేసింది.అనంత‌రం వాటిని కార్డు బోర్డుపై అంటించింది.

ఆ పైన అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి అని రాసింది.అయితే ఆ చిన్నారి క‌ట్ చేసిన క‌రెన్సీ నోట్లు ఒకే సీరియ‌ల్ నంబ‌ర్‌ను క‌లిగి ఉన్నాయ‌ట‌.

దీంతో కొంద‌రు ఏమంటున్నారంటే.ఎవ‌రో కావాల‌ని ఇలా చేశార‌ని, క‌రెన్సీ నోట్ల‌ను క‌ల‌ర్ జిరాక్స్ తీసి ఆ చిన్నారికి ఇచ్చి ఉంటార‌ని అంటున్నారు.

ఇంకొంద‌రు నోట్లు నిజ‌మేన‌ని, చిన్నారికి తెలియ‌క అలా చేసి ఉంటుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.అయితే ఏది ఏలా ఉన్నా ఒక వేళ అవి నిజం నోట్ల‌యితే శిక్ష త‌ప్ప‌దు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

ఎందుకంటే క‌రెన్సీ నోట్లు ప్రామిస‌రీ నోట్‌, లీగల్ బాండ్‌కు స‌మానం.కరెన్సీ నోట్ల‌ను జ‌నాలు వాడుకునేందుకు మాత్ర‌మే హ‌క్కు ఉంటుంది కానీ వారు ఆ నోట్ల‌కు య‌జ‌మానులు కారు.

Advertisement

వారు నోట్ల‌ను అలా క‌ట్ చేయ‌డం, కాల్చ‌డం, చింప‌డం వంటి ప‌నులు చేయ‌రాదు.క‌రెన్సీ నోట్ల‌పై పూర్తి హ‌క్కులు కేంద్ర ప్ర‌భుత్వానికే ఉంటాయి.

ఏది ఏమైనా ఆ చిన్నారి అలా నోట్ల‌ను క‌ట్ చేసి గాంధీజీ బొమ్మ‌ల‌ను సేక‌రించి అంటించ‌డం నిజంగా షాకింగ్‌గా ఉంది క‌దా.!.