ఆ వ్యకి బైక్ స్టార్ట్ చేయగా అందులో దాక్కొని వున్న ఆ జీవిని చూసి బెంబేలెత్తాడు!

సోషల్ మీడియా ప్రభావం బాగా ప్రబలడంతో ప్రపంచం నలుమూలలా జరిగిన విషయాలను మనిషి యిట్టె తెలుసుకోగలుగుతున్నాడు.

ప్రతిరోజూ వీడియోల రూపంలో టన్నుల కొద్దీ కంటెంట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంటుంది.

ఐతే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.కొన్ని ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.

కొన్ని వింతగా అనిపిస్తే మరికొన్ని భయానకంగా ఉంటాయి.ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే గనుక మీరు బెంబేలెత్తిపోవడం ఖాయం.

అవును, వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే, ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు స్పీడుగా తన బైక్ స్టార్ట్ చేయబోయాడు.ఇంతలో దానిమీద కనబడుతున్న దృశ్యం చూసి అతడికి మైండ్ బ్లాంక్ అయింది.

Advertisement

దెబ్బకు భయంతో అక్కడ నుంచి ఒక్క ఉదుటున పరుగులు తీశాడు.కాగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో ఆ దృశ్యం దర్శనం ఇవ్వడంతో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.మనేంద్రగఢ్ భరత్‌పుర్​చిర్మిరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.ఓ వ్యక్తి స్కూటీ స్టార్ట్ చేయగా సడెన్గా అందులో వున్నా కొండచిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యాడు.

దాంతో గమనించిన స్థానికులు వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో.వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి మరీ కొండచిలువను బయటికి తీశారు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆ తర్వాత సురక్షితంగా మనేంద్రగఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు