ఆపదలో ఉన్న మిత్రునికి ఆదుకున్న మిత్ర బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా:32 ఏళ్ల క్రితం కలిసి చదువుకుని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో సెటిలయ్యారు.అందులో ఒక మిత్రునికి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని అందరూ స్పందించి,ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయాలని ముందుకొచ్చారు.

రూ.50 వేలు సేకరించి ఇంటికి వెళ్ళి అందజేసి,మేమున్నాం అంటూ ధైర్యం చెప్పి మిత్రున్ని ఓదార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది.అనాజిపురం గ్రామానికి చెందిన గ్రామీణ కబడ్డీ క్రీడాకారుడుగా గుర్తింపు పొందిన ఐల నర్సయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండు.మోత్కూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 బ్యాచ్ కు చెందిన ఐల నర్సయ్య ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న బ్యాచ్ మిత్రులు ఇంటికెళ్ళి పరామర్శించి రూ.50 వేలు అందజేసి ఆపన్నహస్తం అందించారు.అనంతరం వారు మాట్లడుతూ గ్రామీణ కబడ్డీ క్రీడాకారునిగా జిల్లా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మిత్రుడు ఐల నర్సయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ మిత్రుల మిత్రత్వం చూసి ఫిదా అయిన గ్రామస్తులు స్నేహమంటే ఇదేరా అని అంటున్నారు.ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు అభినయ శ్రీనివాస్,బత్తిని రామకృష్ణ, గూడ గణేష్,ఆవుల వెంకటేశ్వర్లు,ముత్తినేని తిరుమలేష్,గుండెగోని రామచంద్రు,నోముల వెంకన్న, గనగాని నరసింహ,చల్లా వెంకట్ రెడ్డి,గుజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Karamba Review And Player Reputation — A Practical UK Guide

Latest Video Uploads News