అచ్చం మనిషి తరహాలోనే గొరిల్లా తల్లిప్రేమ!

తల్లిప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడన్నా ఒక్కటే, ఏ జీవుల్లో అన్నా ఒకే విధంగా ఉంటుంది.అయితే జంతువులలో గొరిల్లాలు చాలా వేరుగా ఉంటాయి.

ఒకరకంగా చెప్పుకోవాలంటే ఇవి మనుషులకు దగ్గరగా ఉంటాయి.మనుషులను అనుకరించడంలో గొరిల్లాకు మించిన జంతువులు దాదాపు ఉండవనే చెప్పాలి.

గొరిల్లాలు అచ్చం మనుషులకు మల్లే వ్యవహరించి ఆశ్చర్యపరుస్తుంటాయి.ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనబడుతూ ఉంటాయి.

అయితే ఎన్ని వీడియోలు వున్నా ఈ వీడియో మాత్రం చాలా ప్రత్యేకం.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఓ గొరిల్లా చూపించిన తల్లి ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

పిల్లలను తల్లి ఎలా లాలిస్తుందో.అచ్చం అలాగే చేస్తున్న గొరిల్లాని చూసి అవాక్కవుతున్నారు.

కెనడాలోని ఓ జూ పార్కులో ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగు చూసింది.అన్ని జంతువులనూ చూస్తున్న సందర్శకులు గొరిల్లా వద్దకు వచ్చేసరికి అలాగే ఆగిపోయారు.

పిల్లను ఒడిలో పెట్టుకున్న గొరిల్లా చూపించిన తల్లిప్రేమ అందరినీ ఆకట్టుకుంది.దాంతో అక్కడ వున్న ఒకరు ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లో బంధించారు.

వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే.తల్లి గొరిల్లా పిల్ల గొరిల్లాను పైకి ఎత్తుకుని అటూ, ఇటూ తిప్పుతుంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

తర్వాత ఒడిలో పెట్టుకుని ప్రేమగా ముద్దు పెడుతుంది.ఏడుస్తున్న పిల్లలను తల్లి ఎలా లాలిస్తుందో.

Advertisement

గొరిల్లా కూడా అచ్చం అలాగే చేయడంతో అంతా అలాగే చూస్తుండిపోయారు.ఈ వీడియోను సోషల్ మీడియలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది.అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.