అలాంటి యాడ్ లను నమ్మకండి

మీరు ఏదో వెబ్ సైట్ లో ఏదో చదువుతుంటారు .కాస్త కిందికి స్క్రోల్ చేయగానే ఏదో తెల్ల క్రీమ్ ని చూపెడుతూ .

ఇది వాడగానే నెలరోజుల్లో ఇలా తెల్లగా అయిపోయారు అని ఒకే వ్యక్తికి సంబంధించిన రెండు ఫోటోలు దర్శనమిస్తుంటాయి.క్లిక్ చేస్తే వేలల్లో రేటు ఉంటుంది.

A Fraud Fairness Cream Ad Fakes Amit Mishra In Before And After Phase-A Fraud Fa

కొందరు అమాయకులు కొనేస్తారు.అలాంటి యాడ్ నిజానికి చాలా సందర్భాల్లో పూర్తి అవాస్తవంగా ఉంటున్నాయి.

ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తుల ఫోటోలను దొంగలించి, వాటినే ఫోటోషాప్ చేసి, ఒక ఫోటోలో నల్లగా ఉన్నట్లు, మరో ఫోటోలో తెల్లగా మారినట్లు చూపిస్తున్నారు.షాకింగ్ న్యూస్‌ ఏంటంటే, భారత క్రికేటర్, టీమ్ ఇండియా, ఢిల్లీ డేర్ డెవిల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ముఖాన్ని వాడుకుంటూ ఒక యాడ్ ని పెట్టింది ఓ కంపెనీ.

Advertisement

అమిత్ మిశ్రా ఆ క్రీమ్ వాడి తెల్లగా మారాడంట.వారికి మిశ్రా ఎవరో తెలియక పెట్టారా లేక, జనాలకి తెలిసుండదులే అని పెట్టారా అనేది అర్థం కావడం లేదు.

అయినా, ముఖానికి మొటిమో, మచ్చో అయితే తొలగించుకోవడం కోసం ఏదైనా వాడితే ఒకే, చర్మాన్ని బాగుచేసుకోవడం అంటారు దాన్ని.కాని పుట్టుకతో వచ్చిన రంగు కాదని, ఇంకేదో కావాలని ఎందుకో అంత తాపత్రయం.

మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు, ఇంకెవరో ఎందుకు ప్రేమిస్తారు ?.

నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...
Advertisement

తాజా వార్తలు