సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో దొంగ ఓటు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు.అందులో భాగంగానే మహేష్ బాబు చివరగా గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

A Fraudulent Vote In The Name Of Mahesh Babu In Guntur Found Details, Mahesh Bab

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే మహేష్ బాబు పేరుతో ఒక దొంగ ఓటు వేశారట.మరి ఆ వివరాల్లోకి వెళితే.

Advertisement
A Fraudulent Vote In The Name Of Mahesh Babu In Guntur Found Details, Mahesh Bab

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల( Graduate MLC Elections ) నోటిఫికేషన్‌ ను తాజాగా విడుదల చేసింది.ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చట.ఇక ఇదిలా ఉంటే గుంటూరు( Guntur ) పట్టణ పరిధిలో ప్రముఖ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.

A Fraudulent Vote In The Name Of Mahesh Babu In Guntur Found Details, Mahesh Bab

డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ బాబు ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది.నిజానికి మహేష్ బాబు హైదరాబాదు జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు.గత కొంత కాలంలో అక్కడే ఆయన ఎన్నికలలో తన ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.

కాగా ఇప్పుడు మహేష్ పేరుతో ఒక దొంగ ఓటు పుట్టుకు రావడం సంచలనం రేపుతోంది.దీనిపై ఎన్నికల అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.అలాగే ఈ విషయంపై హీరో మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు