వేరే లెవల్ యాడ్ ఐడియా గురూ... ఖచ్చితంగా మెచ్చుకోవలసిందే!

చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ జనాలను ఆకర్శించాలని ముందుగా రకరకాల యాడ్స్ రూపొందిస్తూ వుంటారు.ఈ క్రమంలో వాటికోసం కోట్లను ఖర్చు చేస్తూ వుంటారు.

కొన్ని బడా కంపెనీలు( Big companies ) అయితే సినిమాకు సంబందించిన సెలిబ్రిటీలను సైతం తమ బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకుంటాయి.ఈ క్రమంలో ఒక్కో యాడ్ కి కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తూ వుంటారు.

మరికొందరు తామే స్వయంగా యాడ్స్ రూపొందిస్తూ వుంటారు.ఏది ఏమైనా ఒక వస్తువుని అమ్మాలంటే వారు ఉపయోగించే మొదటి బిజినెస్ స్ట్రేటజీ యాడ్స్( Business Strategy Ads ) అని చెప్పుకోవచ్చు.

అయితే దానిని జనాలకి రీచ్ అయ్యేలా ఎలా చెబుతారన్నదే ఇక్కడ పెద్ద టాస్క్.ఏదేమైనా, ఒకప్పటి యాడ్స్ కి కాలం చెల్లిందని చెప్పుకోవాలి.

Advertisement
A Different Level Of Ad Idea Guru Definitely Appreciated , Idea, Viral Latest, N

ఇది కొత్త ప్రకటనల యుగం.పెద్దపెద్ద కంపెనీలకే పరిమితమైన ప్రకటనలు ఇప్పుడు చిన్న చిన్న హోటళ్లు కూడా ఇస్తున్నాయి.

ప్రచారం ఉన్న వాటిన కొనేందుకే కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.ఇక హోటళ్లు అంటే.

ప్రచారం తప్పనిసరి.మంచి ఆహారం, వెరైటీ ఉందన్న ప్రచారం జరిగితేనే కస్టమర్లు అక్కడికి వెళతారు.

ఇందులో కోసం ఓ హోటల్‌ యజమాని మిగతా వాళ్లలా కాకుండా చాలా వినూత్నంగా ప్రచారం చేయాలనుకున్నాడు.అందరిలా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వకుండా విభిన్నంగా ఆలోచించాడు.

A Different Level Of Ad Idea Guru Definitely Appreciated , Idea, Viral Latest, N
Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఈ క్రమంలో రెస్టరెంట్‌కు సంబంధించిన వివరాలు, వెరైటీలు కరపత్రాల్లో ముద్రించారు.అయితే వాటిని అందరికీ పంచలేదు సుమా.ఇలా పంచితే జనాలు వాటిని ఏం చేస్తారో తెలుసు.

Advertisement

దానికోసం చేసిన ఖర్చు కూడా వృథా అవుతుంది.వీటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఆలోచించి.

పాంప్లెట్స్‌ను పర్సులా ఫోల్డ్‌ చేశారు.అంతేకాదు.

పాంప్లెట్స్‌పై డాల్స్‌ను పోలి ఉండేలా ప్రింట్‌ చేయించాడు.తరువాత అవి కొద్దిగా బయటకు కనిపించేలా పాంప్లెట్స్‌ను ఫోల్డ్‌ చేసి.

జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పడేసారు.ఇంకేముంది కట్ చేస్తే రెస్టరెంట్‌ యజమాని చేసిన వినూత్న ఆలోచన ఫలించింది.

ఇలా పర్స్‌లా ఫోల్డ్‌ చేసిన పాంప్లెట్స్‌ ఇప్పుడు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారిని, వాహనాలపై వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి.ఎలా అంటారా? దానిని చూసిన జనాలు అది నిజంగా పర్సు అనుకొని ఓపెన్ చేసి యాడ్ మొత్తం చదివిస్తున్నారు మరి!.

తాజా వార్తలు