ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా మోతడకలో దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనం జరిగాయి.

ఇందులో భాగంగా మోతడక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ప్రస్తుతం రాక్షస రాజ్యం నడుస్తోందని విమర్శించారు.

సైకో రాజ్యం పోయి సైకిల్ రాజ్యం రావలంటే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.తొమ్మిది నెలల తర్వాత టీడీపీనే అధికారంలోకి వస్తుందన్న ఆయన చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

అప్పుడు తానే హోంమంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్, షూటైడ్ సైడ్ ఆర్డర్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తానంటూ హెచ్చరించారు.

Advertisement
అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు