కొమురం భీం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.తిర్యాణి మండలం గేదెలపాడు శివారులో ఇరువురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.ప్రియుడు సోమేశ్వర్ అప్పటికే ప్రాణాలు కోల్పోగా యువతి మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు